సియోల్ : ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. గురువారం
సాయంత్రం 6.20గంటల సమయంలో పశ్చిమ తీర నగరం నంపో నుంచి స్వల్పశ్రేణి క్షిపణిని
ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆ మిస్సైల్
ఎంత దూరం ప్రయాణించిందో వెల్లడించలేదు. అణు సామర్థ్యం కలిగిన బీ–52 బాంబర్
పరీక్షలను అమెరికా, దక్షిణకొరియా చేపట్టడంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్
ఉన్ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ తీవ్ర
హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.