గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.
కామాతురాణం నభయం నలజ్జ… అన్నారు పెద్దలు.. అంటే కామం కలిగినపుడు దానిని
తీర్చుకోవడానికి భయం కాని సిగ్గు కాని ఉండకూడదు…. ప్రతి జీవి జీవరాసులలోని
కణజాలలో రెండే వృత్తులుంటాయి.. ఒకటి ఆకలి, ఆహారం సంపాదించడం, జీర్ణక్రియ
ద్వారా శక్తిని సంపాదించడం మరలా ఆ శక్తిని వినియోగించడం.. రెండవది
పునరుత్పత్తి చేయడం,. దానికి సెక్సు అనేది ముఖ్యం..దాని ద్వారానే తన జాతిని
పెంపొందింపచేస్తాది…
కాని మనుషులు కూడా అంతే…. మరి మనుషులలో మూడవ ఆయుధం మెదడు… అది శృంగార
వాంఛలను ప్రేరేపిస్తాది… అది జంతువులలోనూ ఉంటాది.. కొన్ని మెదడు వినియోగం
పెరిగిన జంతువులతో సహా శృంగారాన్ని కేవలం పునరుత్పత్తికే వినియోగిస్తాయా? అంటే
లేదు అని సమాధానం వస్తాది…
మరి పునరుత్పత్తి కాక మూడవ ఉపయోగం ఏమిటి? సకలచరాచర జంతు మనుష్య జాతిలో ఏ
ప్రయోగం ఆశించి ఆ శృంగారాన్ని తరచుకోరుకుంటాయి? పునరుత్పత్తే లక్ష్యం అయితే
పిల్లలు పుట్టిన తరవాత శృంగారం కోరుకోకూడదు కదా? మరేముంది? అందులో?
సైన్సు పరంగా చూస్తే శృంగారం లో ప్రిప్లే, ప్లే, ఆప్టర్ ప్లే ఉంటాయి…
ఒక్కొకకరు ఒక్కో దానిలో సంతృప్తి చెందుతారు… వాత్సాయన కామ సూత్రాలు,
అనంగరంగం, కొక్కోకశాస్త్రం వీటిగురించి విశదీకరిస్తాయి..
ఫోర్ ప్లే అంటే శృంగారం ముందుచేసే చుంబనం, ఆలింగనం,నఖక్షతాలు, దంతక్షతాలు
లాంటివన్ని విపరీతమైన కోరికను శృజిస్తాయి… అంతేకాకుండా స్ధలం, వాతావరణం,
సుగంధద్రవ్యపరిమళాలు ముఖ్యపాత్ర వహిస్తాయి,. పరిశుభ్రమైన శరీరం, ఆహ్లాద
వాతావరణం మనసును ఉత్తేజపరుస్తాయి,, చాలామంది స్త్రీలు ఇందులోనే ఎక్కువగా ఆనందం
పొందుతారు…
ప్లే అనగా ఇంటర్ కోర్సు ముఖ్యమైన స్ధితి,.దీనిలో అనుభూతి పొందడమే తప్ప మనం
మాటలలో చెప్పలేము,, కాని ఇందులో కూడా 64 భంగిమలలో శృంగారం చేయచ్చు వారి వారి
శరీర సహకారం దృష్ట్యా అని మహర్షులు చెబుతారు,.. కాని మన సమాజంలో శృంగారం
గురించి మాట్లాడడం తప్పు అదో గుప్తజ్నానం అని, అవసర విజ్నానం అని తెలియకపోవడం
వలన అదో జంతుక్రీడగా మార్చేసారు,.. అందులో మనలోని ప్రతి నాడి నరం
స్పందిస్తుంది,, చర్మం లోని ప్రతికణం ఉత్తేజితమవతాది,. హార్మోనులు వరదలా
ప్రవహిస్తాయి,. రక్తప్రసరణ పది రెట్లు జననేంద్రియాలకు శరీర భాగాలకు చేరుతాది..
దీని వలన గుండె 6 రెట్లు ఎక్కువగా పనిచేస్తాది… ఇదంతా భావప్రాప్తి, స్కలనం
చెందగానే కోరిక మెదడునుంచి తుస్సవుతాది,. కాని మహిళలలో వీటి లెవల్ అంత త్వరగా
తగ్గదు….
అందుకే ఆఫ్టర్ ప్లే ఉంటాది… స్కలనమయినా కూడా అలా ఆలింగనంలో ఉండడం వలన
నిదానంగా హార్మోనులు మామూలు స్ధాయికి వస్తాయి… ఈ సమయంలో అన్ని కండరాలు,
చర్మం, మెదడు రిలాక్స్ కావడం వలన రక్తప్రసరణ మామూలుకు వచ్చేయడంతో
నిద్రపోతారు….
మనలో ఓ అహం, అహంకారం ఉంటాది,. అందుకు ఓ కోరిక తోడవతాది.. ఈ ఇరువురు భావాలతో
నాలుగు భావాలు అక్కడ మమైక్యం కావడంతో రససిద్ధి కలగుతాది… అపుడు మనసు
ప్రశాంతమవతాది.. మెదడులో డోపమిన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోనులు రిలీజవతాయి,. ఆ
తరవాత స్త్రీపురుషులు చాలా పాజిటివ్ గా ఉంటారు, నెగటివ్ ధాట్సు అణిగిపోతాయి..
ప్రపంచం సుందరంగాను జీవితం సంతోషంగా ఉందనే భావన కలుగుతుంది…
కాకపోతే ధర్మార్ధ కామమోక్షములు, అరిషడ్వార్గాల జయింపు పరమపదసోపాన మార్గాలు అని
మన సంస్కృతి లో చెప్పబడింది,.. చిత్తవృత్తులను అణచి ధ్యానం ద్వారా శృంగారం
కంటే అత్యున్నత స్ధాయిలోకి వెళ్ళి శరీరాన్ని మనసుతో రమింపచేసి అత్యంత
భావోద్వేగ స్ధితిని దాటి పరమానంద విషయాన్ని కనుగొనచ్చు అని మన సంస్కృతి లో
చెప్పబడింది.. కాని అది అందరికీ సాధ్యమనే పని కాదు…
కావున మగ అయినా ఆడ అయినా కామాన్ని అణచుకోవాల్సిన అవసరముందా? అనే ప్రశ్న వస్తే
అది మీ ఆలోచనల మొదటి మెట్టు.. జంతువుల మాదిరి కాక అందులో ఏదో అదనంగా పొందదడం
రెండవ మెట్టు… అంతకుముంచి ఏదో ఉంది అని అన్వేషణ చేయడం మూడవ మెట్టు…
ధ్యానంద్వారా ధ్యానాతీత స్ధితి లోకి పోవడం నాలుగవ మెట్టు… శృంగారం కంటే
చిత్తవృత్తుల నిరోధించి ధ్యానం ద్వారా శృంగారం మించిన ఆనందం పొందడం ఆఖరు
మెట్టు…
అపుడతనికి ఏ కామవికారాలు కలగవు,.అత్యంత ఆనందమయిన స్ధాయిలో చిన్న గీత పక్కన
పెద్ద గీత గీసినట్లు సర్వం తెలిసి పోతుంది,, ప్రకృతే పాదాక్రాంతమవుతుంది,,
అతడు లేక ఆమె శృంగారం ను జయించి అత్యంత మహోన్నత స్ధితిలోకి పోతారు…
Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.
(ఈ టాపిక్ కొంచెం కష్ఠమైనది.. శృంగారం గురించి చెప్పాల.. కాని అశ్లీలం శృంగారం
ప్రతిబింబించరాదు.. మహిళలు తప్పుగా అనుకోకూడదు.. శృంగారం లో ఏమి అనుభూతి
లాభాలో చెప్పాల,..శృంగారం కు మించినది ఏదో ఉంది అనే భావనను టచ్ చేసి
వదిలేయాల..అంతే ఉద్దేశ్యం)