ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఐసీసీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సిరీస్‌లో మూడవ టెస్ట్ కోసం పిచ్, దాని
అవుట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియలో “పేలవమైనది” అని రేటింగ్ చేయబడిందని
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శుక్రవారం ప్రకటించింది. ఈ కారణంగా
హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను పొందింది.
కేవలం రెండు రోజుల్లోనే 30 వికెట్లు పడటంతో పిచ్ అసమాన పేస్, బౌన్స్
కారణంగా నిపుణుల నుంచి చాలా విమర్శలను అందుకుంది. ఈ మ్యాచ్‌లో పడిన 31
వికెట్లలో 26 వికెట్లు బౌలర్ల చేతుల్లోకి వెళ్లడంతో పిచ్ పరిస్థితులు
ప్రత్యేకంగా ఇరువైపులా స్పిన్లకు అనుకూలంగా ఉన్నాయి. మ్యాచ్ రిఫరీ క్రిస్
బ్రాడ్, భా రత్, ఆసీస్ కెప్టెన్లు రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్
స్మిత్ మధ్య జరిగిన సంభాషణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. “చాలా పొడిగా
ఉన్న పిచ్ బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను అందించలేదు. ప్రారంభం నుంచి
స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. మ్యాచ్ అంతటా అధిక అసమాన బౌన్స్ ఉంది” అని
మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పిచ్ పరిస్థితుల గురించి చర్చిస్తూ చెప్పారు.