లాస్ఏంజెలెస్, డల్లాస్ : అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను
బలంగా తాకి, కాలిఫోర్నియాను మంచుతో కప్పేసిన టోర్నడో తూర్పు దిశగా కదిలింది.
విద్యుత్తు సరఫరా నిలిచిపోయి వేలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 400కు
పైగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. గంటకు 145 కి.మీ.ల వేగంతో వీస్తున్న
గాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ అధికారులు
ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. టెక్సాస్‌లో 3.40 లక్షల మంది గురువారం
సాయంత్రం వరకు విద్యుత్తు లేకుండా గడపాల్సి వచ్చింది. వాతావరణ ప్రతికూల
పరిస్థితులను గమనించి డల్లాస్, ఫోర్ట్‌వర్త్‌లోని పాఠశాలలను మూసివేశారు.
కాలిఫోర్నియాలో బలమైన గాలులు కొనసాగుతుండటంతో చాలామంది ఆహార కొరతతో దుర్భర
పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని పర్వత ప్రాంత వాసులు
దాదాపు వారం రోజులుగా ఇళ్లలో చిక్కుకొని సాయం కోసం నిరీక్షిస్తున్నారు. వీరి
వాహనాలు మంచులో కూరుకుపోయాయి. కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ అత్యవసర
పరిస్థితిని ప్రకటించారు.