భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ లో
రోహిత్ శర్మకు తోడుగా ఓపెనర్ గా ఎవరు ఉంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి
నెలకొంది. తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ ఘోరంగా
విఫలమయ్యాడు. అతను కొంత కాలంగా పరుగులు చేయడంలో తీవ్రంగా తడబడుతున్నాడు.
వరుసగా విఫలమవుతున్నా రాహుల్ ను తుది జట్టులో కొనసాగిస్తుండటంపై తీవ్ర
విమర్శలు వస్తున్నాయి. రాహుల్ పై వేటు వేసి వివిధ ఫార్మాట్లలో నిలకడగా
రాణిస్తున్న శుభమన్ గిల్ ను ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇండోర్
టెస్టులో జట్టు యాజమాన్యం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియట్లేదు. కెప్టెన్
రోహిత్, కోచ్ ద్రవిడ్ మనసుల్లో ఏముందో కానీ.. నెట్ లో మాత్రం ఇటు రాహుల్, అటు
శుభమన్ తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మూడో టెస్టు బుధవారం ఆరంభం కానుండగా..
సోమవారం ఇండోర్ లో టీమిండియా సాధన ముమ్మరంగా సాగింది. కోచ్ ద్రవిడ్
పర్యవేక్షణలో రాహుల్, శుభమన్.. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే కొంచెం ఎక్కువసేపే
నెట్ లో చెమటోడ్చారు. శుభమన్ దూకుడుగా షాట్లు ఆడగా.. రాహుల్ డిఫెన్స్ మీద
దృష్టిపెట్టాడు. ఇదిలా ఉండగా, తన చివరి 10 ఇన్నింగ్స్‌లలో కేఎల్ రాహుల్ 35
కంటే తక్కువ సగటుతో 125 పరుగులు మాత్రమే చేశాడు.