కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆయన సన్నిహితులే చంపేస్తారని
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్య చేశారు. ‘ఇయర్’ పేరిట తీసిన
డాక్యుమెంటరీలో భాగంగా ఈ మాటలన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం దీర్ఘకాలం
కొనసాగడంపై రష్యా అంతర్గత వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని వార్తలు
వస్తున్నాయి. దీనిపై జెలెన్స్కీ స్పందించారు. పుతిన్ పాలనలోని దుర్బలత్వంతో
ప్రజలు విసిగిపోయిన రోజు ఓ కదలిక వస్తుంది. సొంత ప్రజలే ఆయన్ను గద్దె
దింపుతారని విశ్వసిస్తున్నాను. కిల్లర్‌ను హత్య చేయడానికి వారికొక కారణం
దొరుకుతుంది. కచ్చితంగా అది ఎప్పుడనేది చెప్పలేనని ఆ డాక్యుమెంటరీలో అన్నారు.
రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటామని జెలెన్స్కీ
అన్నారు.