నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు షురూ
కట్టుదిట్టమైన భద్రత మధ్య మొదలైన పోలింగ్
మార్చి 2వ తేదీన ఎన్నికల కౌంటింగ్
రెండంకెల సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమా
మేఘాలయలో పాత వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటం
మరింతగా విస్తరించడం టీఎంసీ లక్ష్యం
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండు
రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఎమ్మెల్యేలను
ఎన్నుకోనున్నారు. రెండింటికీ చెరో 60 సభ్యుల సామర్థ్యం ఉండగా ప్రస్తుత
ఎన్నికలు చెరో 59 సీట్లకు మాత్రమే జరగనుండటం గమనార్హం. నాగాలాండ్‌లోని అకులుటో
నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఖేకాషీ సుమీ బరిలో నుంచి తప్పుకోవడంతో
బీజేపీ అభ్యర్థి కజీటో కినిమి గెలుపు ఏకపక్షమైంది. ఇక మేఘాలయలో సోహియాంగ్
నియోజకవర్గంలో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అభ్యర్థి హెడీఆర్ లింగ్డో
మృతిచెందడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మేఘాయలకు 1972లో తొలిసారి
ఎన్నికలు జరగగా అప్పటి నుంచి నేటి వరకూ ఎప్పుడూ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ
రాలేదు. ఈసారి తాము 30 సీట్ల మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ
అధికార ఎన్పీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా 56 సీట్లలో ఎన్పీపీ తమ
మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలపడం గమనార్హం.
మరోవైపు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ)ల నుంచి కూడా ఆ పార్టీ బలమైన
పోటీని ఎదుర్కొంటోంది. కనీసం రెండంకెల స్థానాలను తాము గెలుస్తామని బీజేపీ
అంచనా వేస్తుండగా, పాత వైభవాన్ని మళ్లీ సంతరించుకోవాలని కాంగ్రెస్
ఆరాటపడుతోంది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ 21మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న
సంగతి తెలిసిందే. అటు టీఎంసీ సైతం మేఘాలయలో తమ పరిధిని విస్తరించాలని
ఆశిస్తోంది. 2021 నవంబరులో రాష్ట్రంలో 12మంది కాంగ్రెస్ నేతలు టీఎంసీలో
చేరడంతో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇక నాగాలాండ్‌లో
కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)లతో కూడిన ప్రతిపక్షం బలహీనంగా
ఉండటంతో మరోసారి బీజేపీ, నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి
గెలవొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఎన్పీఎ్ఫ 26
సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మేఘాలయ, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మేఘాలయాలో 60
అసెంబ్లీ స్థానాలు ఉండగా 59 స్థానాలకు, నాగాలాంగ్ లో 60 స్థానాలకు ఎన్నికలు
జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈశాన్య
రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు నేడు ఎన్నికలు
జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
సాయంత్రం 4 గంటలకు ఈ ఓటింగ్ ముగియనుంది. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు
ప్రక్రియ ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. మేఘాలయ, నాగాలాండ్ ప్రజలు
ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారు రికార్డు సంఖ్యలో
పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.
మేఘాలయలో అధికార కాన్రాడ్ సంగ్మాకు చెందిన ఎన్పీపీ అధికారాన్నితిరిగి
నిలబెట్టుకోవాలని చూస్తుండగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ
పార్టీలు ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నాయి. నాగాలాండ్ లో
ఎన్డీపీపీ-బీజేపీ కూటమి రెండోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. అయితే
అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేని కాంగ్రెస్ 23 మంది అభ్యర్థులను రంగంలోకి
దించింది.
మేఘాలయ ఎన్నికలు : మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. అయితే
ప్రస్తుతం 59 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో పోటీ
చేస్తున్న 69 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మొత్తం 21.6 లక్షల మంది ఓటర్లు
నిర్ణయించనున్నారు. సోహియాంగ్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ
పోలింగ్ వాయిదా పడింది. గత ఐదేళ్లుగా అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న
అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ మాజీ మిత్రపక్షం బీజేపీ, ప్రతిపక్ష టీఎంసీ, ఇతర
ప్రాంతీయ పార్టీలపై ఒంటరిగా పోటీ చేస్తోంది. దక్షిణ తురా నియోజకవర్గం నుంచి
ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా మిలిటెంట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన
బెర్నార్డ్ మరక్ పై పోటీ చేస్తున్నారు. విపక్ష నేత, టీఎంసీ నేత ముకుల్ సంగ్మా
సోంగ్‌సాక్, తిక్రికిల్లా అనే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన
సతీమణి డీడీ శిరా, సోదరుడి భార్య కూడా ఎన్నికల రేసులో ఉన్నారు.
నాగాలాండ్ ఎన్నికలు : నాగాలాండ్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 13
లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అకులుటో నుంచి
బీజేపీ అభ్యర్థి కజెటో కినిమి ఏకగ్రీవంగా గెలిచారు. అధికార నేషనలిస్ట్
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)తో కలిసి బీజేపీ 20 : 40
నిష్పత్తిలో సీట్ల సర్దుబాటుపై పోటీ చేస్తోంది. ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి
ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెఫియు రియో ఉన్నారు. 2003 వరకు రాష్ట్రంలో అధికారంలో
ఉన్న కాంగ్రెస్ 23 మంది అభ్యర్థులను నిలబెట్టగా నాగా పీపుల్స్ ఫ్రంట్
(ఎన్పీఎఫ్) 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 26 స్థానాలు
గెలుచుకున్న ఎన్పీఎఫ్ 22 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా వారిలో ఒకరు
వైదొలగడంతో 21 మంది పోటీలో ఉన్నారు.