అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనిపోతుండటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి.
దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బదింటాయి. ఇటీవలి సంఘటనలు,
విషయాలను మరచిపోవటంతో మొదలై, క్రమంగా పెరిగి, చివరకు వ్యక్తి తానెవరో కూడా
తెలియని స్థాయికి ఈ మతిమరుపు విస్తరిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా 65
సం. పై బడిన వారిలో కనిపిస్తుంది. అయితే కేవలం వృద్దులకు మాత్రమే పరిమితమైనది
మాత్రం కాదు. పలు సందర్భాలలో 40-50 సం. వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్
కనిపిస్తున్నది. అయితే ఇటువంటి మధ్యవయస్కుల్లో కనిపించే అల్జీమర్స్ లక్షణాలను
కొంత మంది డాక్టర్లు మధ్యవయస్సు తాలూకు మతిపరుపుగానో లేక వత్తిడి, మానసిక
కృంగుబాటు, మహిళల్లో అయితే మోనోపాజ్ వంటి లక్షణాలుగా భావించి తేలికగా
తీసుకుంటుంటారు. దాంతో వ్యాధి ముదిరి పరిస్థితి మరింత దిగజారుతుంది.
అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధికి కారకాలుగా మెదడులోని బీటా-అమిలాయిడ్, టౌ
ప్రోటీన్ల అసాధారణ సంకలనాలు పేరుకుపోవడంపై పరిశోధకులు ఎక్కువగా దృష్టి
సారించారు. అయితే ఈ ప్రోటీన్ కంకరలను లక్ష్యంగా చేసుకునే చికిత్సలు పరిమిత
విజయాన్ని చూపించాయి. అల్జీమర్స్ వ్యాధి ఉన్న వ్యక్తుల మెదడులో అనేక
జీవక్రియ మార్పులు కలుగుతాయి. వీటిలో తక్కువ గ్లూకోజ్ (చక్కెర) జీవక్రియ,
కణాల్లో శక్తి నిల్వలు క్షీణిస్తాయి. ముఖ్యంగా సుక్రోజ్, హై-ఫ్రూక్టోజ్
కార్న్ సిరప్ వంటి అదనపు చక్కెరల నుంచి తీసుకుంటే మెదడు జీవక్రియను మార్చగలదని
పలు అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ న్యూరోడెజెనరేటివ్ పరిస్థితి
నివారణ వ్యూహాల అభివృద్ధికి దారితీయవచ్చని వెల్లడించారు.
బీటా-అమిలాయిడ్,టౌ ప్రొటీన్ల అసాధారణ కంకర ఏర్పడటం అల్జీమర్స్ వ్యాధికి
సంబంధించిన ప్రధాన లక్షణం. అయినప్పటికీ ఈ అసాధారణ ప్రోటీన్ కంకరలను లక్ష్యంగా
చేసుకున్న చికిత్సలు పరిమిత విజయాన్ని చూపించాయి. కాగా, ఈ ప్రోటీన్ కంకరలకు
ముందు కనిపించే మెదడు జీవక్రియలో మార్పులు వ్యాధి అభివృద్ధికి కారణమవుతాయని
మరికొందరు పరిశోధకులు ప్రతిపాదించారు.