దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది దశకు
చేరుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్టు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్
వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 26న) టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. దాంతో,
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం ఐసీసీ రాణించిన ఆటగాళ్ల జాబితాను
ఈరోజు విడుదల చేసింది. కీలక ఇన్నింగ్స్‌లతో తమ జట్టు విజయంలో కీలక పాత్ర
పోషించిన తొమ్మిది మంది క్రికెటర్లను షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు
నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించుకుంది.
ఫైనల్ చేరిన ఆసీస్ టీమ్ నుంచి ముగ్గురు, సఫారీ జట్టు నుంచి ఇద్దరు ఈ
లిస్టులో ఉన్నారు. వాళ్లు ఎవరంటే..? ఆస్ట్రేలియా టీమ్ నుంచి బ్యాటింగ్,
బౌలింగ్‌లో రాణించిన మేగ్ లానింగ్, అలిసా హేలీ, అష్ గార్డ్నర్లు ఈ
లిస్టులో చోటు సంపాదించారు. ఇంగ్లండ్ (నాట్ సీవర్ బ్రంట్, సోఫీ
ఎక్లెస్టోన్), దక్షిణాఫ్రికా జట్టు (లారా వొల్వార్డ్, తజ్మిన్ బ్రిస్ట్)
నుంచి ఇద్దరేసి చొప్పున ఈ జాబితాలో స్థానం పొందారు. వెస్టిండీస్ నుంచి హేలీ
మథ్యూస్ను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ తొమ్మిది మందిలో ప్లేయర్ ఆఫ్ ది
టోర్నమెంట్‌గా నిలిచేది ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.