వాషింగ్టన్ : భారత సైన్యంతో సంబంధాలపై పెంటగాన్ప్రకటన చేసింది. ఈ మేరకు
పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మీడియాతో మాట్లాడారు. భారత సైన్యం తో తమ సంబంధాలను
మరింత బలోపేతం చేసుకోవడం కొనసాగుతుందని పెంటగాన్ వెల్లడించింది. పెంటగాన్
ప్రెస్ సెక్రటరీ, బ్రిగేడియర్ జనరల్ పాట్రిక్ రైడర్ వాషింగ్టన్లో
మీడియాతో మాట్లాడారు. ‘అమెరికా, భారత్ మంచి భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.
భారత సైన్యంతో మా సంబంధాలను మరింత అభివృద్ధిపరుచుకోవడం కోసం ఎదురుచూస్తున్నాం’
అని తెలిపారు. గత నెలలో రైడర్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా నుంచి భద్రతా
సహాయాన్ని ఎంచుకునే దేశాలకు భారత్ గొప్ప ఉదాహరణ అని అభివర్ణించారు. రష్యా
నుంచి భారత్ దూరంగా ఉండటానికి తాము ఎలాంటి ప్రతి స్పందనకైనా సిద్ధంగా
ఉన్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా
ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉండటంపై అమెరికా
ప్రజాప్రతినిధుల నుంచి న్యూదిల్లీ విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు రష్యా
నుంచి భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థను కోనుగోలు చేయడంపై అమెరికా అధికారులు
ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెంటగాన్ నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు
ప్రాధాన్యత సంతరించుకున్నాయి.