ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్ఠ ఇంగ్లండ్‌కు ఝలక్
ఇచ్చింది. తద్వారా తొలిసారిగా టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్లోకి
అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఈ సెమీస్‌లో ఆతిథ్య జట్టు ఆరు వికెట్ల
తేడాతో గెలిచింది. ఇక ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఆసీస్‌తో తలపడనుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు
చేసింది. ఓపెనర్లు బ్రిట్స్ (68), వోల్వార్ట్ (53) అర్ధసెంచరీలు సాధించారు.
ఎకెల్‌స్టోన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో
158/8 స్కోరుతో పరాజయం పాలైంది. నాట్ స్కివర్ (40), వ్యాట్ (34), నైట్
(31) పోరాడారు. మరోవైపు డెత్ ఓవర్ల వరకు వీరి విజయం ఖాయమేననిపించింది. కానీ
18వ ఓవర్లో ఖాక మూడు వికెట్లు తీసి షాక్ ఇచ్చింది. అయినా ఆఖరి ఓవర్లో 13
పరుగులే అవసరపడగా.. జోరు మీదున్న కెప్టెన్ నైట్ క్రీజులోనే ఉంది. దీంతో
ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే ఇస్మాయిల్ కేవలం ఆరు పరుగులే ఇచ్చి నైట్
వికెట్ తీయడంతో సఫారీల సంబరాలు మిన్నంటాయి. ఖాకకు నాలుగు, ఇస్మాయిల్‌కు మూడు
వికెట్లు దక్కాయి.