ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఓసారి గర్భధారణ, ప్రసవ సమయంలో ఒక
మహిళ మరణిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు తాజాగా విడుదల చేసిన నివేదికలు
పలు ని ర్ఘాంతపోయే విషయాలను వెల్లడించాయి. ఈ నివేదిక ప్రకారం ప్రసూతి మరణాల
పోకడలు, ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రసూతి మరణాలు పెరిగాయి. ఇది
మహిళల ఆరోగ్యంపై భయంకరమైన ఎదురుదెబ్బలను వెల్లడిస్తుంది.
“గర్భధారణ అనేది మహిళలందరికీ అపారమైన ఆశాజనకంగా, సానుకూలమైన అనుభవంగా ఉండాలి.
అయితే ప్రపంచవ్యాప్తంగా అధిక నాణ్యత, గౌరవప్రదమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో
లేని లక్షలాది మందికి ఇది విషాదకరమైన, ప్రమాదకరమైన అనుభవం” అని ప్రపంచ ఆరోగ్య
సంస్థ జనరల్ (WHO) డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు.
ఈ కొత్త గణాంకాలు ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, తరువాత ప్రతి
స్త్రీ, బాలిక కీలకమైన ఆరోగ్య సేవలను పొందగలరని తెలిపారు. వారు తమ
పునరుత్పత్తి హక్కులను పూర్తిగా వినియోగించుకోగలరని నిర్ధారించుకోవాల్సిన
ఆవశ్యకతను వెల్లడిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2000 నుంచి 2020 వరకు
జాతీయంగా, ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలపై నివేదికలు
రూపొందించారు. ఈ నివేదికల మేరకు 2020లో ప్రపంచవ్యాప్తంగా 2,87,000 ప్రసూతి
మరణాలు సంభవించినట్లు అంచనా వేసింది. ఇది 2016లో 3,09,000 నుంచి స్వల్ప
తగ్గుదలని సూచిస్తుంది.
అమరికాలోని ఎనిమిది ప్రాంతాలలో రెండింటిలో – యూరప్, ఉత్తర అమెరికా, లాటిన్
అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో ప్రసూతి మరణాల రేటు 2016 నుంచి 2020 వరకు
వరుసగా 17శాతం , 15 శాతంగా నమోదైంది. మరికొన్ని చోట్ల రేటు నిలిచిపోయింది.
అయితే పురోగతి సాధ్యమేనని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు, రెండు ప్రాంతాలు –
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్య, దక్షిణాసియా – ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలు
చేసినట్లుగా, అదే కాలంలో వారి ప్రసూతి మరణాల రేటు గణనీయంగా తగ్గింది.