ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్-2023లో భారత జట్టు ప్రస్థానం ముగిసింది. తొలి
సెమీఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పోరాడి ఓడిపోయింది. టీమిండియాలో
హర్మన్ ప్రీత్ కౌర్ 51, రోడ్రిగ్స్ 43 పరుగులు చేశారు. కాగా, 172 పరుగుల
లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత బ్యాట్స్ఉమెన్స్ టాపార్డర్ విఫలమైంది.
30 పరుగుల లోపే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ – రొడ్రిగేజ్ జోడీ చక్కటి భాగస్వామ్యాన్ని
నెలకొల్పి భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. కీలక సమయంలో వికెట్లు పడడం.. ఆ
తర్వాత వచ్చినవారు ధాటిగా ఆడలేకపోవడంతో ఓటమి ఖరారైంది. మిగతా బ్యాటర్లు అంతగా
రాణించకపోవడంతో టీమిండియా 20 ఓవర్లకు ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు
మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు
దూసుకెళ్లింది. రేపు రెండో సెమీఫైనల్ జరగనుంది. గ్రూప్-బీలో తొలి స్థానంలో
ఉన్న ఇంగ్లండ్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా నేడు రెండో
సెమీఫైనల్ లో ఆడతాయి. గెలిచిన జట్టు ఈ నెల 26న ఆస్ట్రేలియాతో ఫైనల్ లో ఆడనుంది.