సియాటెల్ : అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని కూడా
చేర్చిన మొదటి నగరంగా సియాటెల్ నిలిచింది. దీనికి సంబంధించి స్థానిక సభలో
ప్రవాస భారతీయురాలు, సియాటెల్ నగర కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్
తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాత్యహంకారం కంటే కుల వివక్ష భిన్నంగా లేదని
అందువల్ల దీనిని కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. సియాటెల్ సిటీ
కౌన్సిల్ 6-1 ఓట్లతో దాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో అమెరికాలోని ప్రవాస
భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని కౌన్సిల్
వెల్లడించింది. ఈ సందర్భంగా క్షమా సావంత్ మాట్లాడుతూ ఈ స్ఫూర్తి దేశమంతా
విస్తరించేలా కృషి చేయాలన్నారు.