కోపెన్‌హేగన్ : నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఇప్పటివరకు 305 మంది
నామినేట్ అయ్యారని నార్వేకు చెందిన ఎంపిక కమిటీ తెలిపింది. ఫిబ్రవరి 1న తుది
గడువు కాగా నాలుగేళ్లతో పోల్చుకుంటే దరఖాస్తులు తక్కువగా వచ్చాయని తెలిపింది.
93 సంస్థలకు చెందిన 212 మంది పేర్లను విడుదల చేయలేదంది. ఎనిమిదేళ్లుగా ఏటా
300 మందికి పైగా నామినేట్ అవుతుండగా 2016లో అది 376 ఉందని పేర్కొంది. 50
ఏళ్లుగా ఎంపిక ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
వ్యక్తులతో కూడిన విస్తారమైన బృందాలు, జాతీయ, రాష్ట్ర స్థాయి
ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, గతంలో నోబెల్ శాంతి బహుమతి
గ్రహీతలు నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. ప్రచారం కోసం దాన్ని వారు బహిర్గతం
చేస్తుంటారు. ఈసారి నార్వేలో గ్రీన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు లాన్
మారీ న్యూయెన్ బెర్గ్ ఇద్దరు వాతావరణ పరిరక్షకుల పేర్లను నామినేట్ చేశారు.
వారిలో స్వీడన్‌కు చెందిన గ్రీటా హ్యున్బెర్గ్, ఉగాండాకు చెందిన వనిస్సా
నకటె ఉన్నారు. గ్రీటా హ్యున్బెర్గ్ ఇప్పటివరకు నాలుగుసార్లు నామినేట్
అవ్వగా.. గతేడాది ఉక్రెయిన్, బెలారస్, రష్యాలకు చెందిన మానవ హక్కుల
రక్షకులకు బహుమతి దక్కింది. మరోవైపు ఓస్లోలోని శాంతి పరిశోధన సంస్థ సంచాలకుడు
హెన్రిక్ ఉర్దాల్ మానవ హక్కుల పరిరక్షకులను నామినేట్ చేశారు. వారిలో
ఇరాన్‌కు చెందిన నర్గీస్ మహమ్మదీ, అఫ్గానిస్థాన్‌కు చెందిన మెహబూబా సిరాజ్,
యూఎన్‌లో మయన్మార్ ప్రతినిధి క్వావ్ మో తున్ తదితరులున్నారు. 2021లో
డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌ల పేర్లు ఈ బహుమతికి నామినేట్ అయ్యాయి. ఇలా ఏటా
నోబెల్ శాంతి బహుమతి పోటీ అందరినీ ఆకట్టుకుంటోంది.