స్లో పిచ్… బంతి బౌన్స్ కావడమే గగనంగా మారింది. కానీ, ఆస్ట్రేలియా ఆటతీరు
మాత్రం ఈ ట్రాక్ పరిస్థితికి విరుద్ధంగా సాగింది. తొలి టెస్టులో తమ
ఇన్నింగ్స్ ఓటమికి స్పిన్నర్లే కారణమని కమిన్స్ సేనకు తెలుసు. అందుకే రెండో
టెస్టులో వారి బంతులను స్వీప్ షాట్లతో దీటుగా ఎదుర్కోవాలని వ్యూహ రచన
చేసింది. కానీ, ఇది మిస్‌ఫైర్ అయి చేజేతులా వికెట్లను సమర్పించుకునేలా
చేసింది. మూడో రోజు తొలి సెషన్ ఆరంభమయ్యే సమయానికి ఆసీస్ 62 పరుగుల
ఆధిక్యంలో ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లున్నాయి. ఈ దశలో ఆసీస్ క్రితం రోజు
మాదిరే దూకుడుగా వెళ్తుందని అంతా భావించారు. కానీ, స్పిన్‌పై ఆధిక్యం చూపాలనే
ఆత్రుతే వారి కొంపముంచింది. బంతి ఎక్కువగా బౌన్స్ కాకపోవడంతో బ్యాటర్స్
స్వీప్ షాట్లకు ప్రాధాన్యమిచ్చారు. స్మిత్, రెన్షా, క్యారీ, కమిన్స్,
కునేమన్ ఇలా వికెట్లను చేజార్చుకున్నవారే. హెడ్, లబుషేన్ తప్ప ఎవరూ
రెండంకెల స్కోర్లు కూడా సాధించలేకపోయారు. కాస్త సహనాన్ని ప్రదర్శిస్తూ బంతిని
సరిగ్గా అంచనా వేస్తే పరుగులు వస్తాయనే ఆలోచన విడిచారు. ఓ రకంగా స్పిన్
బంతులు వీరిలో భయాందోళనలను పెంచాయి. భారత గడ్డపై స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు
క్రాస్ బ్యాట్ షాట్లు ఓ ప్రత్యామ్నాయమే కానీ, దానికే కట్టుబడడం సరికాదనే
విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోట్లాలాంటి లోబౌన్స్ ట్రాక్‌పై అసలే
సరికాదు. అందుకే అటు జడేజా.. ఇటు అశ్విన్ ధాటికి ఆసీస్ తమ చివరి తొమ్మిది
వికెట్లను 52 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఆదివారం ఆటలో కేవలం 19.1 ఓవర్లు
మాత్రమే క్రీజులో ఉండగలిగాయంటే కోట్లా పిచ్ వారిని ఎలా ఇబ్బందిపెట్టిందో
అర్థం చేసుకోవచ్చు.