జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా
చేశాడు. రెండు రోజుల కిందట ఓ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో
సెలక్షన్ కమిటీకి సంబంధించి పలు అంతర్గ విషయాలను చేతన్ బయటపెట్టడం దుమారం
రేపింది. గాయపడిన క్రికెటర్లు త్వరగా ఫిట్నెస్ సాధించేందుకు ఇంజక్షన్లు
తీసుకుంటారని, గంగూలీ, కోహ్లీ మధ్య ఇగో సమస్య తీవ్రంగా ఉండేదని, యువ
క్రికెటర్లకోసమే టీ20 జట్టునుంచి రోహిత్, విరాట్లకు విశ్రాంతి ఇచ్చారని,
తదితర ఎన్నో సంచలన విషయాలను స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ వెల్లడించిన సంగతి
తెలిసిందే. ఈ వ్యాఖ్యలన్నీ బీసీసీఐ పెద్దలకు ఏమాత్రం మింగుడుపడలేదని సమాచారం.
దాంతో అతడు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలగక తప్పదని ఆ రోజునుంచే అంతా
భావిస్తున్నారు. ప్రస్తుతం అదే నిజమైంది. ‘చేతన్ శర్మ తన పదవికి రాజీనామా
చేశాడు. దానిని బీసీసీఐ కార్యదర్శి జై షా ఆమోదించాడు. స్టింగ్ ఆపరేషన్
తర్వాత అతడు పదవిని వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. చేతన్ శర్మే స్వయంగా
తప్పుకొన్నాడు. అంతేతప్ప రాజీనామా చేయాలని బోర్డు కోరలేదు’ అని బీసీసీఐ
సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. బెంగాల్-సౌరాష్ట్ర మధ్య
జరుగుతున్న రంజీట్రోఫీ ఫైనల్‌ను తిలకించేందుకు సహచర సెలెక్టర్లతో కలిసి చేతన్
కోల్‌కతాలో ఉన్నాడు. ఇరానీ ట్రోఫీ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్షన్
కమిటీ అక్కడకు వెళ్లింది. తన రాజీనామాను ఆమోదించగానే చేతన్ కోల్‌కతానుంచి
ఢిల్లీ చేరుకున్నాడు.