ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.
రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే వాటిని జీఎస్టీ కిందకు తీసుకొస్తామన్నారు.
రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే ఇది సాధ్యమవుతుందని సీతారామన్
వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)
పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే వాటిని జీఎస్టీ కిందకు
తీసుకొస్తామన్నారు. రికార్డు స్థాయిలో ఉన్న పెట్రోల్ ధరలను నియంత్రించేందుకు
వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి
తీసుకురావడం సాధ్యమవుతుందని సీతారామన్ వెల్లడించారు. ఇందుకు కేంద్రం సుముఖత
వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటివరకు జీఎస్టీ మండలిలో దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు
చర్చకు రాలేదన్నారు.
పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో జరిగిన చర్చా
కార్యక్రమంలో కేంద్ర మంత్రి సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోలియం
ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక
మంత్రి బదులిచ్చారు. రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యమవుతుందని
వెల్లడించారు. ఇటీవలే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడిన ఆర్థిక
మంత్రి దేశావృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని
అన్నారు. తాజా బడ్జెట్లోనూ మూలధన వ్యయాన్ని 33శాతం పెంచి రూ.10లక్షల కోట్లకు
చేర్చామని వెల్లడించారు. కేంద్ర విద్యుత్ సహా పలు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం
తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రాలు కూడా అమలు చేసేలా చర్యలు చేపడతామన్నారు.గత
కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
అయినప్పటికి చాలా రాష్ట్రాల్లో వాటి ధరలు రూ.100కి దగ్గర్లో, కొన్ని చోట్ల వంద
పైనే ఉన్నాయి. ఇలా రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరుగుతున్న కారణంగా పెట్రోల్,
డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి నియంత్రించాలనే డిమాండ్లు కొంతకాలంగా
వినిపిస్తున్నాయి. ఇందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయినప్పటికి
ఇప్పటివరకు జీఎస్టీ మండలిలో దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు చర్చకు రాలేదు.
మరోవైపు పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడంపై పలు రాష్ట్రాలు భిన్న వాదనలు
వినిపిస్తున్నాయి. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్ర
ప్రభుత్వాలకు నష్టం జరుగుతుందని ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. వివిధ పన్నుల
రూపంలో వచ్చే ఆదాయం భారీగా తగ్గితుందని చెబుతున్నాయి.