రూ. కోట్లు కుమ్మరించే ఐపీఎల్లో భాగం కావడానికి ఇతర దేశాల క్రికెటర్లు
అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా దూరమవుతున్నారనే సంగతి తెలిసిందే. అందుకే తాజాగా
బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నీకి ఉన్న ఆదరణ
దృష్ట్యా.. మెగా లీగ్ కోసం ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)
క్యాలెండర్లో భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా ఓ షెడ్యూల్
రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ నిర్ణయం
పాకిస్తాన్ క్రికెట్‌పై పెను ప్రభావం చూపుతుందనే వార్తలు వస్తున్నాయి.
2023 ఆసియా కప్ కోసం భారత పురుషుల జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడంపై భారత
క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరంతరం కఠిన వైఖరిపై పాకిస్థాన్ కెప్టెన్
షాహిద్ అఫ్రిది తన అభిప్రాయాలను పంచుకున్నాడు. గేమ్ సెట్ మ్యాచ్ పేరిట
పాకిస్తాన్ టీవీ ఛానల్ సమా నిర్వహించిన ఓ టాక్ షోలో షాహిద్ అఫ్రిది
మాట్లాడుతూ… ‘క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ శాసించే స్థాయిలో భారత్ ఉంది.
క్రికెట్ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఇండియాదే. కాబట్టి భారత్ ఏం చెబితే
అదే జరుగుతుంది. మార్కెట్ వ్యూహాలు, ఎకానమీలో ఇదంతా ఒక భాగం’ అని అన్నారు.
ఐపీఎల్ కొనసాగుతున్న సమయంలో ఇతర జట్లు అంతర్జాతీయ టోర్నమెంట్లను కూడా వాయిదా
వేసుకోవడమో లేదా రీషెడ్యూల్ చేసుకోవడమో జరుగుతోందని, క్రికెట్‌పై భారత్
సాధించిన ఆధిపత్యానికి ఇది నిదర్శనం అని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ఒక
అద్భుతమైన వేదిక అని, ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే అనుభవం ఇక్కడ పొందడం
అమూల్యమైనదన్నాడు.