ధనాధన్ బ్యాటింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఇండియా ఉ మెన్స్
టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జాక్ పాట్ కొట్టింది. ఐపీఎల్ లో మెన్స్
ప్లేయర్లకు తీసిపోని రీతిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్
వేలంలో కోట్లు కొల్లగొట్టింది. ఏకంగా 3 కోట్ల 40 లక్షలు దక్కించుకొని ఔరా
అనిపించింది. సోమవారం ముంబైలో జరిగిన వేలంలో మొదటి పేరుగా వచ్చిన మంధానను
ఆర్సీబీ అత్యధిక రేటుతో సొంతం చేసుకుంది. ఈ స్టార్ బ్యాటర్ కోసం ముంబై
ఇండియన్స్ సైతం పోటాపోటీగా బిడ్ వేసింది. పట్టువదలని ఆర్సీబీ ఆమె కోసం తమ వద్ద
ఉన్న మొత్తంలో 30 శాతంపైనే ఖర్చు చేసి ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ లో మొత్తం అయిదు జట్లు మాత్రమే పాల్గొనబోతున్నాయి. వాటిలో రాయల్
చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్
జయింట్స్, యుపి వారియర్స్ ఉన్నాయి. ఈ మహిళల ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్
బెంగళూరు టైటిల్ కొట్టే సత్తా ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేసిందని చెప్పాలి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల ఐపీఎల్ జట్టుకు . ఆర్సీబీ చాలా జాగ్రత్తగా
ఆచితూచి వేలంలో ప్లేయర్స్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఆయా మహిళా క్రికెటర్లు
చేసిన ప్రదర్శనను ఆధారంగా చేసుకుని చాలెంజర్స్ యాజమాన్యం ఆటగాళ్లను తీసుకుంది.
ఇక ప్రస్తుతం ఆర్సీబీ సొంతం చేసుకున్న ప్లేయర్స్ లో ముగ్గురు చాలా కీలకంగా
మారే అవకాశం ఉంది. మొదటగా ఇండియా స్టార్ స్మృతి మంధాన కోసం ముంబై, బెంగళూరు
పోటీ పడ్డాయి. చివరికి 3 .4 కోట్ల తో స్మృతి మంధానను బెంగుళూరు సొంతం
చేసుకుంది. ఈమెనే ఆ జట్టుకు కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
“మేము పురుషుల వేలాన్ని చూస్తూనే ఉన్నాము. ఈ రకమైన వేలం ఆడటం చాలా పెద్ద
క్షణం. మొత్తం విషయం ఖచ్చితమైనది” అని స్మృతి. మంధాన ట్విట్టర్లో రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది.