బెంగళూరు : ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక
కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక
స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది. 14వ ఏరో ఇండియా షోను ప్రధాని నరేంద్ర
మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు
కుదుర్చుకోనున్నారు. కాగా ఈ ఎయిర్ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక
రంగ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో వైమానిక ప్రదర్శన
చూసేందుకు సామాన్యులకు అవకాశం కల్పించనున్నారు. ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా
నిర్ణయించారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను
ప్రదర్శించనున్నాయి. వీటిలో ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్, మార్టిన్,
ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ
రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్ అండ్
టీ, భారత్ పోర్జ్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్
సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇండియన్ పెవిలియన్ ద్వారా 115
సంస్థల 227 ఉత్పత్తులను పదర్శిస్తారు. అందులో ఎల్‌ఆర్‌యూ, ఎల్సీఏ-తేజస్,
ఎఫ్‌సీఎస్, డిజిటల్ ఫ్లై బై, మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్, ప్రభుత్వ,
ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో తయారైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.