బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో
టెస్టు వేదిక మారనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ధర్మశాల వేదికగా
మార్చి 1న ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇటీవలే ధర్మశాల స్టేడియంలో
భారీగా పనులు చేపట్టారు. అక్కడి తీవ్ర వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు ఔట్ ఫీల్డ్, పిచ్ ఏరియాను పూర్తిగా
మార్చేశారు. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయి. కానీ పిచ్, ఔట్‌ఫీల్డ్‌ను
ఇంకా పరీక్షించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన
ట్రోఫీ కావడంతో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే వేదికను
మార్చాలని నిర్ణయించింది. ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు
జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది
ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ
బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్‌తో పాటు పిచ్ సైడ్ ఏరియా పూర్తిగా
సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు.
అయితే టెస్ట్ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్
పనులను పూర్తి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)
హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్‌కు బ్యాకప్‌గా మరో ఐదు స్టేడియాలు
ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ
ఛాన్స్‌లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు.
కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే
ధర్మశాలలో పాత పిచ్‌ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే
మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను
అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్ చేశారు. ఈ పనులు
చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్ జరిగేది
అనుమానంగా మారింది.