రమేశ్ బైస్‌కు మహారాష్ట బాధ్యతలు
న్యూ ఢిల్లీ: మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేశ్ బైస్ను రాష్ట్రపతి ద్రౌపది
ముర్ము నియమించారు. ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను
ఆమోదించారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేశ్ బైస్ను నియమించారు రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము. ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను
ఆమోదించారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సైతం కొత్త గవర్నర్‌ను
నియమించారు రాష్ట్రపతి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్
నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు.
మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో
నియమించారు ముర్ము.
వీటితో పాటు అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు ముర్ము. అరుణాచల్ ప్రదేశ్
గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్‌గా
లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, అసోం
గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివ్ ప్రతాప్‌లను
నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.