నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తొలి రోజు
ఆస్ట్రేలియాను భారత్ భారీ స్థాయిలో చిత్తు చేసింది. టీమిండియా స్పిన్ దెబ్బకు
ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలిరోజే చేతులెత్తేశారు. జడేజా, అశ్విన్ బౌలింగ్
దాటికి పేకమేడలా ఆసీస్ వికెట్లు కూలిపోయాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆసీస్
వికెట్లు కోల్పోతూనే వచ్చింది. ఆరంభంలో ఓపెనర్లను షమీ, సిరాజ్ లు పెవిలియన్
బాటపట్టించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ బాధ్యతను స్పిన్నర్లు తీసుకున్నారు. ఈ
క్రమంలో జడేజా ఐదు, అశ్విన్ మూడు వికెట్లు తీశారు. స్టీవ్ స్మిత్ (37),
లబుషేన్ (49) భారత్ బౌలర్ల ధాటికి నిలబడి స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం
చేశారు. కానీ, లంచ్ బ్రేక్ తరువాత పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో అశ్విన్,
జడేజాలు వరుస ఓవర్లు వేసి వికెట్లు రాబట్టారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 63.5
ఓవర్లకు గాను కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయింది. లుబుషేన్ (49), స్మిత్ (37),
అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్కాంబ్ (31) మినహా ఎవరూ రెండంకెల స్కోర్
చేయలేదు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు తన మొదటి వికెట్ కోల్పోయింది.
76 పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. టాడ్ మార్ఫీ బౌలింగ్‌లో అతడికే
క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు. 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్, 20 పరుగులు చేసి
వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్ కూడా ఉంది.
భారత స్పిన్నర్లకు అనవసర ప్రయోజనం చేకూర్చేందుకు బోన్-డ్రై వికెట్‌ను
ఎంపిక చేసి నీరుగార్చారని నివేదికలు వచ్చిన తర్వాత కొంతమంది ఆస్ట్రేలియన్
విశ్లేషకులు “డాక్టర్” అని సూచించిన పిచ్‌పై రోహిత్ సులభంగా బ్యాటింగ్ చేశాడు.
ఆస్ట్రేలియా తరఫున టాడ్ మర్ఫీ మాత్రమే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసి ఒక వికెట్
తీశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 4-1-27-0తో తిరిగి వచ్చాడు. అతని
ప్రదర్శనను ఆస్ట్రేలియా గ్రేట్లు మాథ్యూ హేడెన్, మార్క్ వా విమర్శించారు.