న్యూఢిల్లీ : అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై విచారణ కోరుతూ
దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. అదానీ గ్రూపు మీద
వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని విశాల్
తివారి అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. ఇదే
అంశంపై మరో పిటిషన్ కూడా శుక్రవారం విచారణకు రానుంది. దీంతో రెండు పిటిషన్లు
కలిపి శుక్రవారమే విచారిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్
పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పేర్కొంది.