ఆసియా కప్ 2023 విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.
ఈ ఏడాది ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే, టోర్నీ కనుక
పాకిస్థాన్‌తో జరిగితే భారత జట్టు అక్కడికి వెళ్లబోదని బీసీసీఐ ఖ రాఖండిగా
చెబుతోంది. అలాగైతే ఇండియాలో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో తాము కూడా
ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌ను
తటస్థ వేదికపై నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) భావిస్తున్నట్టు
తెలుస్తోంది. ఈ నెల 4న బహ్రెయిన్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు
వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాదిలాగే టోర్నీని యూఏఈకి తరలించాలన్న చర్చ
జరిగినట్టు సమాచారం. అయితే, వేదిక మార్పు విషయంలో మార్చిలో తుది నిర్ణయం
తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
భద్రతా కారణాల దృష్ట్యా పాక్ లో టోర్నీ నిర్వహిస్తే తాము ఆడబోమని
బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశంలోనే
ఆసియా కప్ ను నిర్వహించాలని విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో
పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ భారత్‌పై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు
చేశాడు. భారత జట్టు పాకిస్థాన్ కు వచ్చేలా ఐసీసీ చూడాలన్నారు. బీసీసీఐని
నియంత్రించలేనప్పుడు పాలకమండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని
ప్రశ్నించాడు. ప్రతి జట్టుకు ఒకే విధమైన నిబంధనలను అమలు చేయాలన్నాడు. నియమాలు
పాటించని బీసీసీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని జావేద్ డిమాండ్ చేశాడు.
పాకిస్తాన్లో భారత్ ఓడిపోతే అక్కడి ప్రజలు సహించరంటూ జావేద్ కీలక వ్యాఖ్యలు
చేశాడు.
భారతదేశం ఒక పవర్ హౌస్ అయితే కావొచ్చని, కానీ అది క్రికెట్‌ను శాసించలేదని
మియాందాద్ అన్నాడు. ఆ జట్టు బలమైనదే అయితే అది దానికి గొప్ప కానీ తమకు,
ప్రపంచానికి కాదన్నాడు. పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడాలని, అసలు ఎందుకు ఆడరని
ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో కనుక భారత జట్టు ఓడిపోతే అక్కడి ప్రజలు అది
సహించలేరని, అందుకే ఆ జట్టు రావడానికి భయపడుతోందని మియాందాద్ ఎద్దేవా చేశాడు.