పాకిస్థాన్ రెండు మూడు రోజులుగా బాంబు పేలుళ్లతో అట్టుడుకుతోంది. మసీదులో
బాంబు పేలుడు ఘటన మరువక ముందే మరో బాంబు దాడి జరిగింది. ఈరోజు
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ వేదిక అయిన క్వెట్టాలోని బిగుత్
స్టేడియం సమీపంలో బాంబు పేలింది. పోలీస్ స్టేషన్ దగ్గర్లోని మూసా చౌకా
ప్రాంతంలో బాంబు పేలడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. కొందరు
ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అదే సమయంలో బిగుత్ స్టేడియం
వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కోపోద్రిక్తులైన మరికొందరు అభిమానులు బిగుత్ స్టేడియంలోకి రాళ్లు
రువ్వారు. మరికొందరు టైర్లకు నిప్పు పెట్టడంతో మైదానంలో పొగ ఆవరించింది.
దాంతో, ఎగ్జిబిషన్ మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. స్టేడియం బయట భద్రతను
కట్టుదిట్టం చేసిన పోలీసులు అందోళనకారులను చెదరగొట్టారు. 4 వేలమంది
పోలీసు బందోబస్తు మధ్య మ్యాచ్ కొనసాగింది. స్టేడియం సామర్థ్యానికి మించి
ఎక్కువమంది మ్యాచ్ చూసేందుకు రావడం కూడా ఫ్యాన్స్ ఆందోళనకు కారణం అని
తెలిసింది. ఫ్యాన్స్ రాళ్లు రువ్వుతున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.

బాబర్ ఆజం, సర్ఫరాజ్ ఖాన్ ఈ రెండు జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు. అయితే
పేలుడు తర్వాత మ్యాచ్ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. క్వెట్టాలోని మూసా
మసీదు సమీపంలో ఈ బాంబు పేలుడు జరిగినట్లు పాక్ మీడియా పేర్కొంది. పేలుడు
జరిగిన ప్రదేశం నగరానికి కేవలం 15 నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. అయితే
ఈ బాంబు పేలుడుతో మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ దాడికి బాధ్యత
వహిస్తున్నట్లు నిషేధితం అయిన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)
ప్రకటించింది. భద్రతా అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు పేలుడు తర్వాత
టీటీపీ తెలిపింది.