వైట్‌బాల్ ఫార్మాట్లో తన స్లో స్ట్రైక్ రేట్‌పై భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్
గతంలోఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. టీమిండియాకు భవిష్యత్తు స్టార్‌గా
అతన్ని పరిగణిస్తున్నప్పటికీ.. గిల్ స్ట్రైక్ రేట్ పై క్రికెట్ నిపుణులు,
అభిమానులు గతంలో పలు ప్రశ్నలు రేకెత్తించారు. కానీ, ప్రస్తుత తన ఆట తీరుతో
గిల్ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని
3వ, చివరి టీ 20 ఫార్మాట్లో తన తొలి సెంచరీని సాధించి, తన సత్తా ఏమిటో
నిరూపించాడు. అంతకుముందు కివీస్‌తో జరిగిన వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన గిల్,
తన కెరీర్లో తొలిసారి తక్కువ ఫార్మాట్లో ట్రిపుల్ డిజిట్ స్కోరుకు
చేరుకున్నాడు. గిల్ తన సెంచరీని కేవలం 54 బంతుల్లో పూర్తి చేశాడు, టీ20లో
సెంచరీ చేసిన 5వ భారతీయుడిగా నిలిచాడు.

ఇక తాజాగా టీ 20లో 126 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించిన గిల్ ఇప్పుడు
అంతర్జాతీయ టీ20ల్లో భారత తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అంతకుముందు
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు
సృష్టించాడు. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై కోహ్లి అజేయంగా 122 పరుగులు
చేశాడు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అతడిని అధిగమించాడు.