టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో సిరీస్‌ను కూడా క్లీన్
స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా
రాణించిన టీమిండియా.. 90 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల
సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్
నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో
9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101), శుభ్‌మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5
సిక్స్‌లతో 112) సెంచరీతో చెలరేగగా… హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు,
3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకోబ్ డఫ్ఫీ,
బ్లెయిర్ టిక్నర్ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్
పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295
పరుగులకు కుప్పకూలింది. డెవాన్ కాన్వే(100 బంతుల్లో12 ఫోర్లు, 8 సిక్స్‌లతో
138) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. హెన్రీ నికోల్స్(42) మినహా మరే
బ్యాటర్ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మూడేసి
వికెట్లు తీయగా.. చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్
మాలిక్ చెరొక వికెట్ తీశారు.