ఉన్నట్టు వార్తలు
2013లో వాషింగ్టన్ పోస్ట్ ను సొంతం చేసుకున్న బెజోస్
అమ్మకం వార్తలను ఖండించిన బెజోస్ ప్రతినిధి
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్
ను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫుట్ బాల్ టీమ్
వాషింగ్టన్ కమాండర్స్ ను కొనుగోలు చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ
న్యూయార్క్ పోస్ట్ లో కథనం వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ అమ్మకానికి సిద్ధంగా
ఉన్నట్టు మరో మీడియా సంస్థ కూడా వెల్లడించింది. అయితే ఈ వార్తలను బెజోస్
అధికార ప్రతినిధి ఖండించారు. వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మడం లేదని ఆయన తెలిపారు.
2013లో 250 మిలియన్ అమెరికన్ డాలర్లకు వాషింగ్టన్ పోస్ట్ ను బెజోస్ సొంతం
చేసుకున్నారు. ఇటీవల బెజోస్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, న్యూస్ పేపర్ ను సొంతం
చేసుకోవడం తన లక్ష్యం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం. తనకు ఫుట్ బాల్ అంటే
చాలా ఇష్టమని చెప్పారు. అయితే ఏదైనా జాతీయ ఫుట్ బాల్ జట్టును సొంతం
చేసుకోవాలనే విషయంపై మాత్రం ఆయన బహిరంగంగా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో, ఆయన
వాషింగ్టన్ పోస్ట్ ను అమ్ముతారా? లేదా? అనే విషయంపై రానున్న రోజుల్లో పూర్తి
క్లారిటీ రానుంది.