లండన్ : బ్రిటన్ రాజు ఛార్లెస్-3, ఆయన సతీమణి క్యామిల్లా పట్టాభిషేకం ఈ
ఏడాది మే నెలలో వైభవంగా జరగనుంది. ఈ వేడుకలో శతాబ్దాల సంప్రదాయానికి కొత్త
చక్రవర్తి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. పట్టాభిషేక సమయంలో రాజ దుస్తులను
ధరించే ఆచారానికి ఆయన దూరంగా ఉండనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక
‘ఇండిపెండెంట్’ వెల్లడించింది. మునుపటి పట్టాభిషేకాలలో, చక్రవర్తి
సాంప్రదాయకంగా పట్టు మేజోళ్లు, చల్లడాలను ధరించేవారు. అయితే, కింగ్ ఛార్లెస్-3
ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన తన
సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజ దుస్తులకు బదులుగా సైనిక
యూనిఫారంలోనే ఆయన పట్టాభిషేకంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. తన వద్ద
ఉన్న సీనియర్ సలహాదారులను సంప్రదించిన తర్వాత కొత్త చక్రవర్తి ఈ నిర్ణయానికి
వచ్చారని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంప్రదాయ
దుస్తులు కాలం చెల్లివనిగా ఉండడం వల్లే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 కి మే 6న అధికారికంగా పట్టాభిషేకం జరగనుంది.
వెస్ట్‌మినిస్టర్ అబేలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. తర్వాతి రోజు
విండ్సర్ క్యాజిల్‌లోనూ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున
జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది సామాన్య ప్రజలను కూడా
అనుమతించనున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన క్వీన్
ఎలిజిబెత్-2 గత ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం
బ్రిటన్ నూతన రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు.