నేడు విచారణకు రానున్న పిటిషన్
కారును పోలిన గుర్తుల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
మరెవరికీ ఆ గుర్తులు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలన్న బీఆర్ఎస్
హైదరాబాద్ : కారును పోలిన గుర్తులు తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించకుండా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయిస్తుండడం వల్ల తమకు తీరని నష్టం జరుగుతోందని, బీఆర్ఎస్కు ఓటు వేయాలని వచ్చిన వృద్ధులు ఆ గుర్తులను కారుగా భ్రమపడి వాటికే వేస్తున్నారని పేర్కొంది. కాబట్టి తమ గుర్తును పోలిన గుర్తులను ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై నేడు విచారణ చేపట్టనుంది.