ఎవరెన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచేది జగనే: మంత్రి జోగి రమేష్
ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల బతుకులు బాగుపడాలంటే జగనన్నే కావాలి: ఎంపీ నందిగాం
గుంటూరు : వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత యాత్రలో భాగంగా మూడో రోజు బాపట్లలో జరిగిన బస్సుయాత్ర దిగ్విజయంగా జరిగింది. పదిందల ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, బాపట్ల ప్రజల పాల్గొన్నారు. యాత్రలో భాగంగా బాపట్ల అంబేద్కర్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. సభకు శాసనసభ్యులు కోన రఘుపతి అధ్యక్షత వహించారు. పిట్టల వానిపాలెం మండలం సంగుపాలెం నుండి చందోలు ,రెడ్డిపాలెం సెంటర్, కర్లపాలెం ద్వారా బాపట్ల చేరిన వైసీపీ బస్సు యాత్రకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సభ ప్రారంభంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సామాజిక సాధికారత సభలో ఆయా వర్గాలు మాత్రమే ఉండాలని సూచించారు. సభలో బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత , గుంటూరు టు శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల ఏఎంసీ చైర్మన్ డి ,సీతారామిరెడ్డి, బాపట్ల పట్టణ వైసిపి అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎవరెన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచేది జగనే: మంత్రి జోగి రమేష్
వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర చేపడితే నారా లోకేష్ ఇది గాలి యాత్ర అంటూ చులకనగా మాట్లాడుతున్నాడని మంత్రి జోగి రామేశ్ మండిపడ్డారు. “లోకేష్ ఇది గాలి యాత్ర కాదు.. దండయాత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మన సామాజిక యాత్రను చులకనగా మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్టీలను తేలిక చేసి మాట్లాడుతున్న లోకేష్‌కు గుణపాఠం చెబుదాం. సీఎం జగన్‌ను పీకేస్తాం.. తేల్చేస్తాం అంటూ ఏదో చెత్త వాగుడు వాగుతున్నారు. సీఎం జగన్ ఏమైనా మొక్క అనుకున్నారా.. పీకేయడానికి. సీఎం జగన్ ఒక వీరుడు, ధీరుడు, దమ్మున్న నాయకుడు” అని మంత్రి జోగి రామేశ్ మరోసారి స్పష్టం చేశారు. ఎవరెన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచేది జగనే అని పేదలతరుపు నిలబడ్డా జగన్ కు ఆయన చేసిమ మంచే ఆయనకు రక్షఅని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీల బతుకులు బాగుపడాలంటే జగనన్నే కావాలి: ఎంపీ నందిగాం సురేష్
“అమరావతి పేరుతో చంద్రబాబు కుంభకోణం చేస్తే.. అదే మన జగనన్న పేదల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మన నోటికాడి కూడు చంద్రబాబు లాక్కొన్నాడు. మన రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం జగన్ ప్రభుత్వమే కావాలి” అని ఎంపీ నందిగాం సురేష్ పేర్కొన్నారు. భావి తరాలకు బాటలు వేస్తున్న ఏకైక నాయకుడు జగన్ అని, కానీ పవన్ ది అవకాశ రాజకీయాలని ధ్వజమెత్తారు జగన్ ను భయపెట్టే మగాడు పుట్టలేదని, భయపెడతానన్న లోకేశే.. భయపడుతున్నాడని ఎద్దేవా చేసారు.
పదికాలాల ముందు చూపుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక వ్యక్తి జగన్: రాజ్యసభ సభ్యులు మోపిదేవి
పేదరికం పోవాలి అంటూ అందరూ నినాదాలు ఇచ్చారే కానీ ఎవరూ చేయలేదు..ఒక జగన్ తప్ప. గత పాలకులకు భిన్నంగా పేదల కోసం జగనన్న పాలన సాగింది. గడప గడపకు మన ప్రభుత్వం వెళ్తోంది. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి పేర్కొన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకున్నారని, కానీ బలహీనవర్గాలకు పెద్దపీట వేసిన ఘనత జగనన్న ప్రభుత్వానిదే అని ఉద్ఘాటించారు.
ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల వైసీపీ అడ్డా అని ఇక్కడ రఘుపతిని కొనగలిగే వాడుగాని, ఓడించగలిగేవాడు గాని ఎవడూ లేడని పేర్కొన్నారు.
పేదల గుండె చప్పుడు జగన్ మోహన్ రెడ్డి అని, జగనన్న తోనే సామాజిక విప్లవం సాధ్యమని, చంద్రబాబువి మోసపూరిత రాజకీయాలని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు