పదవులు, సంక్షేమంలో సింహ భాగం బలహీన వర్గాలకే: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
మైనార్టీలకు పదవులనిచ్చి గౌరవించిన వ్యక్తి జగన్: కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్*
గతంలో బీసీ ఒట్లతో గద్దెనెక్కిన టీడీపీ బీసీలకు చేసింది సున్నా.. ఎంపీ బీద మస్తాన్ రావు
కడప : కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర శనివారం జరిగింది. అందులో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ పాల్గొని బహింరంగా సభలో ప్రసంగించారు. ఈ బహిరంగా సభకు భారీగా ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాలు ప్రజలు హాజరయ్యారు.
సంక్షేమం..అధికారంలో సింహ భాగం బలహీన వర్గాలకే ఇచ్చిన వ్యక్తి జగన్: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
సామాజిక న్యాయం అనేది గతంలో మాటలకే పరిమితమైందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. బీసీలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కేబినెట్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారని, నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని చెప్పారు. సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది. కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. మళ్లీ జగనే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంజాద్ బాషా తెలిపారు.
దళితలకు అండగా నిలిచిన నేత సీఎం జగన్: ఎంపీ బీద మస్తాన్ రావు
దళితులను గత ప్రభుత్వం మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ దళితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. దళితులకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర ఎవ్వరికీ లేదని తెలిపారు.
పేదల లీడర్ సీఎం జగన్: కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్
మన అందరి నాయకుడు జగన్, కుల, మత బేధాలు చూడకుండా మేలు చేసిన వ్యక్తి జగన్. మన ప్రాంతంలో మైనార్టీనైన నాకు సీటు ఇచ్చి గౌరవించారు. కేబినెట్ తో సహా 70శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదువులనిచ్చి గౌరవించిన వ్యక్తి జగన్ అని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ పేర్కొన్నారు
సామాజిక న్యాయం చేతల్లో చూపిన వ్యక్తి సీఎం జగన్: ఎమ్మెల్యే రాచమల్లు
దేశంలో ఇప్పటి వరకు సామాజిక సాధికారత కోసం కలలు కనటమే కానీ ఆచరించిన వారు ఒక్కరు కూడా లేరని, మొట్టమొదటిసారి సీఎం జగన్ సామాజిక న్యాయం చేసి చూపించిన వ్యక్తిగా నిలిచాడని ఎమ్మెల్యే రాచమల్ల పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎనాడు జరగని మంచి జగనన్న ప్రభుత్వంలో జరిగిందని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా ఉన్నారని, వారి పిల్లలని చక్కగా చదువించుకున్నారని, అప్పులబారిన పడకుండా జగనన్న రుణమాఫి చేశాడని, రూ.2.38 లక్షల కోట్లు నేరుగా పేదింటి మహిళల ఖతాలకే వేశాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.