విజయవాడ : ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటాను భద్రపరచాలంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది. ఈ నెల 26 వరకు సమయం కావాలని సీఐడీ పీపీ న్యాయస్థానాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 26కి వాయిదా వేసింది.