వెలగపూడి : రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసు వ్యవహారంలో కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలని సీఐడీ దాఖలు చేసిన పటిషన్‌పై నేడు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది. కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి కొన్ని ఆడియో ఫైల్స్‌ను అందించారు. మంగళవారం (అక్టోబర్ 17న) మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని సీఐడీ తెలిపింది. అనంతరం విచారణను వచ్చే నవంబర్ 1కి హైకోర్టు వాయిదా వేసింది. అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. అయితే ఈ కేసులో మరో నలుగురి పేర్లను కొత్తగా చేర్చామని, రీఓపెన్ చేయాలని ఇటీవల సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి నారాయణ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే.