శోభాయమానంగా తిరుమల క్షేత్రం : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల క్షేత్రాన్ని విద్యుద్దీపాలు, పూల తోరణాలతో అలంకరించారు. శ్రీవారి ఆలయంలో విశేష పుష్పాలతో అలంకరణ చేపట్టారు. టీటీడీ పుష్ప, చిత్ర ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది. టీటీడీ ఉద్యానశాఖ ఆధ్వర్యంలో హిందూ పురాణాలలోని అపురూప ఘట్టాలు ప్రత్యేకంగా నిలిచాయి. విజయవాడకు చెందిన ప్రముఖ కళాకారులు కృష్ణ ఈ ఏడాది బెల్ పెప్పర్స్, వంకాయలు, ముల్లంగి, చెర్రీ టమాటాలతో శ్రీమహాలక్ష్మి అమ్మవారిని రూపొందించారు. టీటీడీ ఫొటో ఎగ్జిబిషన్లో ఈ ఏడాది అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాలు, వాహనసేవల సమయంలో యాత్రికుల భావోద్వేగాలు, టీటీడీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ప్రదర్శనలో ఉంచింది. శేషాచల అడవుల్లో నెలకొన్న తిరుమల ఆలయ అద్భుత దృశ్యాలను అటవీశాఖ ఏర్పాటు చేసింది.