తణుకు : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఆదివారం తణుకు పట్టణం జడ్పీహెచ్ బాలురు హై స్కూల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన జయంతి వేడుకలను మంత్రి జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ‘మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఎపీజే అబ్దుల్ కలాం జన్మదినం రక్షణ రంగానికి చాలా చారిత్రాత్మకమైన్నారు. అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు కలాం కృషి చేశారని మంత్రి కొనియాడారు. దేశ ప్రజలకు అబ్దుల్ కలాం స్ఫూర్తిగా నిలుస్తారు అని అన్నారు. భారతదేశాన్ని బలమైన, సంపన్నమైన, సమర్థవంతమైనదిగా మార్చడంలో తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కలాం జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం అని గుర్తు చేసుకున్నారు. స్వయం-ఆధారిత బలమైన దేశాన్ని నిర్మించాలని కలలు కన్న వ్యక్తి అబ్దుల్ కలాం మని అన్నారు. మాతృభూమి సేవ కోసం కలాం తన జీవితమంతా అంకితం చేశారని.. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు. తమిళనాడులోని రామేశ్వరం నుండి వచ్చిన డాక్టర్ కలాం ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి, ప్రతి తరానికి స్ఫూర్తి , రోల్ మోడల్‌గా నిలిచిపోయారన్నారు. అతను గొప్ప విజనరీ నాయకుడు కలాం ఎల్లప్పుడూ విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపగలిగారిని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు వైసిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.