గుంటూరు : తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాజీ సీఎం చంద్రబాబునాయుడి స్కీల్ కుంభకోణం కేసులో రాష్ట్రపతి జోక్యాన్ని కోరడం ద్వారా తప్పచేసినట్లు ఒప్పుకొని, దోషిగా నిర్దారించినట్లు అయ్యిందని రాజ్య సభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్టికల్ 72 ప్రకారం కేవలం దోషుల విషయంలో మాత్రమే రాష్ట్రపతి జోక్యం అవసరమవుతుందని చెప్పారు. సీనియర్ న్యాయవాది, అతి తెలివిగల తేదేపా ఎంపీలు చంద్రబాబు విచారణలో జోక్యం చేసుకొని, అతనని కేసు నుంచి తప్పించి దోషిని విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరుతున్నారని తెలిపారు..
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే ద్వారా రికార్డు స్థాయిలో సేవలు : జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా రికార్డు స్థాయిలో 5.28 కోట్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన అన్నారు..గత నెల 30 నుండి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్నమహిళల కోసం ప్రత్యేకంగా వైద్యులు సేవలందిస్తున్నారన్నారు. ఈ శిబిరాల్లో 172 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు.
ఫలిస్తున్న సీఎం జగన్ కృషి : పోలవరం ప్రాజెక్టు కోసం సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందన్నారు. ప్రాజెక్టు తొలి దశ సవరించిన రూ.31.625.38 కోట్ల అంచనా వ్యయానికి సీడబ్లూసీ ఆమోదం తెలిపిందని చెప్పారు..ఈ ప్రాజెక్టు విషయంలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒక్కోటి సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్దపట్ల సాగునీటీ రంగ నిపుణులు సైతం ప్రశంసిసస్తున్నారని తెలిపారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/VIJAY.jpeg]