అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 17 మునిసిపల్ కార్పొరేషన్లలో పనిచేయుచున్న ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు పరిష్కారం కొరకు రాష్ట్రంలో గల అన్ని మునిసిపల్ కార్పొరేషన్ ల ఉద్యోగుల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేసాయానికి ఏపి జెఏసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన అన్ని అంశాలు పై కూలంకషముగా చర్చలు జరిపి, రాష్ట్ర మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలపై భవిషత్ కార్యాచరణ నిమిత్తం హాజరైన అన్ని మునిసిపల్ కార్పొరేషన్ ల ఉద్యోగుల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశమునకు హాజరైన సభ్యుల ఏకగ్రీవ ఆమోదముతో ఈ క్రింది ఆడ్ హాక్ కమిటీ ని నియమించారు. ఈ సమావేశంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ గౌరవ అధ్యక్షులు వామన రావు , ఏపీ జేఏసీ అమరావతి కోశాధికారి వి. వి మురళి కృష్ణ నాయుడు, లేబర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కిషోర్ కుమార్, 13 కార్పొరేషన్ల నుండి నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్అ ధ్యక్షులు ఈశ్వర్ దొప్పలపూడి , ప్రధాన కార్యదర్శి. అక్కరబోయిన అప్పలరాజు తెలిపారు.
రాష్ట్ర అడహాక్ కమిటీ సభ్యులు వీరే : అధ్యక్షులుగా ఈశ్వర్ దొప్పలపూడి సీనియర్ అసిస్టెంట్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, సహా అధ్యక్షులు, ఏ. రాంబాబు, శానిటరీ సుపెర్వైజేర్, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు రెవిన్యూ ఆఫీసర్, రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్, టి. నాగరాజు సీనియర్ అసిస్టెంట్ శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్, జి. ఎస్, కే. దేవరాయలు శానిటరీ ఇన్స్పెక్టర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, విశ్వనాధ రెడ్డి కడప మునిసిపల్ కార్పొరేషన్, అమర్నాద్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ చిత్తూర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలు జి. హెలెన్ సూపరింటెండెంట్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ప్ర, ధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు సూపరింటెండెంట్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్. కార్యదర్శులు ఎం. రాంబాబు, శానిటరీ సుపెరివైజేర్, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ఎ, స్. వెంకట కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్, సి. హెచ్. మోహన్ గోపాల్ , జూనియర్ అసిస్టెంట్, మచిలీపట్టణం మునిసిపల్ కార్పొరేషన్, కళ్యాణ చక్రవర్తి సీనియర్ అసిస్టెంట్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, ఎన్. పిచ్చయ్య శానిటరీ సుపెర్వైజేర్, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్, మహిళా కార్యదర్శి డాక్టర్. డి. మాధురి జూనియర్ అసిస్టెంట్, మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ , గాలి సుధాకర్ సూపరింటెండెంట్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, జాయింట్ సెక్రెటరీస్ ఎం. అప్పలరాజు, సీనియర్ అసిస్టెంట్, విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ , జె. నాగార్జున, శానిటరీ ఇన్స్పెక్టర్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్. సాధిక్ హుస్సన్ కర్నూల్ మునిసిపల్ కార్పొరేషన్, జి. ప్రదీప్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్, ఎం. వి. ఎస్. కే. కృష్ణ మూర్తి, సూపరింటెండెంట్, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్. కోశాధికారి గా మువ్వల రవి సీనియర్ అసిస్టెంట్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికయ్యారు.