విజయవాడ : ఆనాడు మోసపురితంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం
పని తీరుపై 50 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ వైసీపీ
అధినేత పాలనపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో
మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం షేక్
రాజా హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామని హామీ ఇచ్చి
చేయలేదన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు
సిబ్బందిని నియమించాలని గంగాధర్ డిమాండ్ చేశారు. వాహన మిత్ర ప్రోగ్రామ్ కు
వచ్చే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుని నిరసన తెలియజేస్తామని ప్రకటించారు.
విజయవాడ సిటీ జనసేన పార్టీజాయింట్ సెక్రెటరీ శాభింకర నరేష్ ఆర్య కటిక
మాట్లాడుతూ ఆర్య కటిక కులం అభివృద్ధికి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని ఆవేదన
వ్యక్తంచేశారు. తాము 2024 లో ఎన్నికల్లో జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తామని
నరేష్ ఆర్య కటిక ప్రకటించారు. విలేకరుల సమావేశంలో రెడ్డిపల్లి గంగాధర్ తో
పాటుగా షాబికార్ నరేష్, పిళ్ళ రవి, మద్దెల కనకారావు, రెడ్డిపల్లి అనిత,
తదితరులు పాల్గొన్నారు.