బాపట్ల : అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేల చేత చంద్రబాబును అవమానిస్తూ జగన్
శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం
చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి
అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అక్రమ
కేసుల్లో ముద్దాయిగా జైలు జీవితం అనుభవించిన వ్యక్తి జగన్ అని అన్నారు.
చంద్రబాబుపై జరగని స్కిల్ స్కాం జరిగినట్టుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం
చేస్తోందన్నారు. చంద్రబాబుపై స్కిల్స్ స్కాం కేసు , నారా లోకేష్‌పై ఇన్నర్
రింగ్ రోడ్డు కేసు పెట్టి జగన్ నాలుగున్నర ఏళ్ల పాలనలో చేసిన అవినీతిని
కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్
ప్రభుత్వానికి ఓటమి తప్పదన్న భయంతోనే అక్రమ కేసులు అరెస్టులు చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సమయం కోసం
వేచి చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కడిగిన ముత్యం లాగా మళ్లీ ప్రజల్లోకి
వస్తారన్నారు. చంద్రబాబుకి పట్టం కట్టటానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని నక్కా
ఆనందబాబు పేర్కొన్నారు.