మూడేళ్లు ముందుగానే రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు : మంత్రి ఉషశ్రీచరణ్
ఆడపుట్టకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు
మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారు : మంత్రి రోజా
వెలగపూడి : మహిళ రిజర్వేషన్‌కు మద్దతుగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది.
సోమవారం శాసనసభలో మహిళా సాధికారతపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది.
మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ సారథ్యంలో మహిళా సాధికారతకు
అడుగులు వేశామని, వైఎస్సార్ చేయూతలో మహిళలను సీఎం జగన్ ఆదుకుంటున్నారన్నారు.
యువత పేరుతో చంద్రబాబు దోచుకున్నార ని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా
చంద్రబాబు యువతను మోసం చేశారని ఆరోపించారు. హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చేందుకు
మిగతా డైయిరీలకు నష్టం కలిగించారన్నారు. స్కాముల సీఎంగా చంద్రబాబు
గుర్తుండిపోతారని, సీఎం జగన్ సారథ్యంలో మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వాల
కంటే పదిరెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నా మని చెప్పారు. పార్లమెంట్లో మహిళా
రిజర్వేషన్ బిల్లు పాస్ కాకముందే. మూడేళ్లు ముందుగానే రాష్ట్రంలో 50 శాతం
రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు
సీఎం జగన్ తుడిచారని, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారన్నారు. ప్రతి
ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్ తీరుస్తున్నారని, మహిళల కోసం చేసిన కృషిన చూసి
మహిళలందరూ జయహో జగన్ అంటున్నారని చెప్పారు. సంక్షేమం అంటే ఏమిటో
నాలుగున్నరేళ్లలో చేసి చూపించారని, సీఎం జగన్ పాలనలో మహిళలు ఆర్థికంగా ఎంతో
బలంగా మారారన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా?. ఆడపుట్టకనే
ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు చీటర్.. జగన్
లీడర్, చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలేనని మహిళలందరికీ తెలుసని,
చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. బాలకృష్ణ మొన్న
తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారని, సీఎం జగన్ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ
చర్చకు రాగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదని,
పనికిమాలిన పార్టీ అన్నారు. మహిళలకు రాజకీయంగా సీఎం జగన్ ఎన్నో అవకాశాలు
కల్పించారని, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే రాజకీయంగా సీఎం జగన్
అవకాశాలు ఇచ్చారన్నారు.
రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడబిడ్డకు సీఎం జగన్ అండగా ఉన్నారని ఎమ్మెల్యే
పుష్ప శ్రీవాణి అన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్ మహిళలకు రాజకీయంగా
అనేక అవకాశాలు కల్పించారని, రాష్ట్రంలో మహిళలకు ఎన్నో పథకాలు అమలవుతున్నాయని,
అందుకు కారణం సీఎం జగన్ అని, మహిళల సాధికారత కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి
ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కె. శ్రీదేవి మాట్లాడుతూ మహిళలకు అన్ని
విధాలుగా సీఎం జగన్ చేయూత అందిస్తున్నారని, పేదల సొంతింటి కల
నెరవేరుస్తున్నారాణి అన్నారు. మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని, మహిళల
రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. దిశా యాప్, మహిళా పోలీసుల ద్వారా
రక్షణ కల్పిస్తున్నారని, గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు సంఘాలను మోసం
చేశారని తెలిపారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ మహిళా రైతులకు సీఎం
జగన్ అండగా ఉంటున్నారన్నారు. మహిళా సంక్షేమంలో దేశంలో ఏపీ ఆదర్శంగా
నిలిచిందని, మహిళలను శక్తివంతులుగా తయారు చేస్తున్నారన్నారు. మహిళలకు ఆదాయ
మార్గాలను చూపిస్తున్నారని, మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు
చేపడుతున్నారని, మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగుతోందని
చెప్పారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థుల తల్లుల
ఖాతాలో నగదు జమ చేస్తున్నారని, గత ప్రభుత్వంలో మహిళలు ఎన్నో కష్టాలు పడ్డారని
పేర్కొన్నారు.