అమరావతి : రాజమండ్రి వెళ్తున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద
బాబును పోలీసులు అడ్డుకున్నారు. నల్లజర్ల టోల్ గేట్ వద్ద ఆపిన పోలీసులు ఆయనను
అదుపులోకి తీసుకున్నారు. నల్లజర్ల టోల్ గేట్ వద్ద ఆపిన పోలీసులు ఆయనను
అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు నక్కా
ఆనందబాబు, కనపర్తి శ్రీనివాసరావు, బుచ్చి రాం ప్రసాద్, వేములపల్లి శ్రీరామ్
ప్రసాద్ (బుజ్జి) తదితరులు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి వెళ్లేందుకు
అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం
వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఐటీ
ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చారు. పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
ఖమ్మం మీదుగా రాజమండ్రికి వచ్చారు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి
వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బోర్డర్ వద్ద ఐడి కార్డులు
వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలిపెట్టారు. చంద్రబాబు అక్రమ
అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో
రాజమండ్రి’ కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం ఆంధ్రా, తెలంగాణ
సరిహద్దు వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ
వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు.
సరిహద్దు వద్ద మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ డీసీసీ అనిత, నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి
సారించారు.