తిరుపతి : తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 27 నుంచి
29వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు
సెప్టెంబరు 26వ తేదీ సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన,
పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. ఆలయంలో
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి
వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ
మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ
శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబరు
27వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 28న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 29న
పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి ఒకరు ఒక రోజు ఈ
పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు
బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల్లో సెప్టెంబరు 26న అంకురార్పణ రోజున
కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, ఊంజల్‌సేవ, మొదటిరోజు సెప్టెంబరు 27న
కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 28న రెండో రోజు
తిరుప్పావడ సేవ, బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, వేదాశీర్వచనం,
కుంకుమార్చన, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 29న పవిత్రోత్సవాల్లో చివరిరోజు
అభిషేకానంతర దర్శనం, బ్రేక్ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం,
వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది.