అమరావతి : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన ఏడో రోజూ
కొనసాగుతోంది. రాష్ట్రంలోని సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం
స్పందించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ,
పింఛను అమలు తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. మాకు బదులుగా
సచివాలయ సిబ్బందితో పనిచేయిస్తామంటున్నారు. మరి మా సంగతేంటి? పని చేయని
మొబైల్ ఫోన్లు ఇచ్చారు. తెలంగాణ కంటే రూ. వెయ్యి అదనంగా జీతం ఇస్తామన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు.
కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం
ఇవ్వాలని కోరుతున్నాం. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె చేస్తామని అంగన్వాడీ
కార్యకర్తలు స్పష్టం చేశారు.