విశాఖపట్నం : నాయకులు వ్యక్తిగత స్వార్ధాలు ఆధిపత్య పోరు పక్కన పెట్టి పార్టీ గెలుపునకు కలిసి పనిచేయాలని వై.వి సుబ్బారెడ్డి కోరారు. వై. వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం 60 వ వార్డు కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ సభ్యులు పీవీ సురేష్ గతంలో చిన్న చిన్న విభేదాల వల్ల పార్టీకి దూరమవడం బాధాకరమని, తదుపరి పార్టీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ చొరవ తీసుకొని పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ నిబద్ధత తో పనిచేసే పి.వీ సురేష్ లాంటి వ్యక్తి మన పార్టీకి అవసరమని పార్టీ పెద్దలకు తెలియజేసి ఆయనపై ఉన్న సస్పెన్షన్ తొలగించి పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి , జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులమీదుగా పార్టీ కండువాను వేసి రాబోయే కాలంలో ఆనంద్ కుమార్ గెలుపు బాధ్యతలు పీవీ సురేశ్ భుజస్కందాల మీద వేసుకొని మనస్ఫూర్తిగా అంకుటిత దీక్షతో పార్టీ సైనికుడిలా పనిచేయాలని పీవీ సురేష్ ను వై.వి సుబ్బారెడ్డి కోరారు. జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పీవీ సురేష్ లాంటి వ్యక్తి అండగా నిలిచి ఎటువంటి మనస్పర్ధలకు అవకాశం లేకుండా మరల వైయస్సార్ కుటుంబంలోకి పునరాగమనం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. జగనన్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకు చేసిన మేలుంటే తెలియజేసి జగన్ మోహన్ రెడ్డి ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సమిష్టి కృషితో కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కార్యకర్తలను కోరడం జరిగింది. 60 వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్ మాట్లాడుతూ మరల నా యొక్క పునరాగామనానికి కృషిచేసిన ఆనంద్ కుమార్ కి పార్టీ పెద్దలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, ముఖ్యమంత్రి జగనన్న ఆశయాలను ఖచ్చితంగా క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన కార్యకర్తలా శక్తి వంచన లేకుండా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనంద్ గెలుపునకు కృషి చేస్తానని వైవి సుబ్బారెడ్డి, అమర్నాథ్ సమక్షంలో పి. వి సురేష్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ స్థానిక నాయకుల సమన్వయం చేసి పనిచేసి గెలుపు తీరాలకు చేర్చే విధంగా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుందన్నారు.