అనకాపల్లి : జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు. 2016లో టీడీపీ ప్రభుత్వం తమ భూములకు అవార్డు ప్రకటించిందని తెలిపారు. నేటికీ భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోలేదని భూ నిర్వాసితులు అన్నారు. దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులు పూర్తిచేయడంపై లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే ప్రాజెక్టులకు భూసేకరణ చేసినపుడు చట్టప్రకారం పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని యువనేత హామీ ఇచ్చారు.
అంగన్ వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు: నారా లోకేశ్
వేతనాల పెంపు, గ్రాట్యుటీలపై డిమాండ్ చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రభుత్వం మాట తప్పిందంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగడం తెలిసిందే. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. అంగన్ వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటన చేశారు. అందరినీ మోసం చేసినట్టే, జగన్ అంగన్ వాడీలను కూడా మోసం చేశాడని లోకేశ్ విమర్శించారు. పనికి తగ్గ వేతనం ఇస్తామని జగన్ మాట తప్పారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల కంటే అధిక జీతం హామీ పైనా మడమ తిప్పారని లోకేశ్ వివరించారు. పైగా, అంగన్ వాడీలపై పని ఒత్తిడి పెంచారని విమర్శించారు.