టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి : దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నిరుద్యోగిత రేటు నమోదైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతానికి పెరగటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో వర్ధిల్లిన రాష్ట్రాన్ని వైఎస్ జగన్ నాశనం చేశారని విమర్శించారు. ఫలితంగా యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఏపీ యువత భవిత మెరుగుపడాలని లోకేష్ ట్వీట్ చేశారు.