175 స్థానాలకు 175 కొట్టడానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వైఎస్ఆర్ సీపీ
గుంటూరు : ఏమాత్రం మొహమాటలకు,
శషభిషలకు పోకుండా
భారీ గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ
అధిష్టానం అడుగులేస్తోంది.
స్థానచలనం జాబితాలో
పలువురు మంత్రులు కూడా ఉన్నారు
గుంటూరు పశ్చిమ – విడుదల రజిని
మంగళగిరి – గంజి చిరంజీవి
పత్తిపాడు – బాలసాని కిషోర్ కుమార్
వేమూరు – అశోక్ బాబు
సంతనూతల పాడు – మేరుగ నాగార్జున
తాడికొండ – మేకతోటి సుచరిత
కొండెపి – ఆదిమూలపు సురేష్
చిలకలూరి పేట – రాజేష్ నాయుడు
అద్దంకి – పాణెం హనిమి రెడ్డి
రేపల్లె – ఈవూరు గణేష్
గాజువాక – వరికూటి రామచంద్రరావు
రేపటి నుంచి వీరంతా పార్టీ వ్యవహారాలను ఆయా నియోజకవర్గాల్లో పర్యవేక్షిస్తారని మంత్రి బొత్స తెలిపారు.
పార్టీ ఎవర్నీ వదులుకోదు అన్నారు. అందరీ సేవలను వినియోగించుకుంటామన్నారు. 175కు 175 సీట్ల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అణగారిన వర్గాల వారికి ధైర్యం ఇచ్చి పని చేస్తున్నామన్నారు. ఏదో మాటలు చెప్పి చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నామని బొత్స తెలిపారు.
“అన్నీ శాస్త్రీయంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మార్చిన ఈ 11 మంది గెలవరని కాదు. ఇంకా మంచి మెజార్టీతో గెలవాలన్నదే మా ఆలోచన. ప్రతిపక్షానికి ఒక దారీ తెన్నూలేకుండా పోతోంది. ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి వారిది. కానీ మా పార్టీలో అన్నీ చర్చించే నిర్ణయం” – సజ్జల రామకృష్ణా రెడ్డి.